ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం దీక్ష

BABUఆంధ్ర్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా దీక్షకు రెడీ అయ్యారు AP సీఎం చంద్రబాబు నాయుడు. పుట్టిన రోజున శుక్రవారం(ఏప్రిల్-20) జన్మభూమి కోసం దీక్ష పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే దీక్ష చేస్తునానన్నారు AP సీఎం.

దీక్ష సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలతో చర్చించారు AP సీఎం. దీక్షకు మద్దతుగా 13 జిల్లాలో 13 మంది మంత్రులు దీక్ష చేయనున్నారు. మిగతా మంత్రులు…నేతలు మొత్తం 250 మందితో దీక్షలో కూర్చోనున్నారు బాబు. దీక్ష సందర్భంగా మొత్తం లక్ష మంది హాజరయ్యేల ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. బాబు దీక్షపై సీరియస్ అవుతున్నారు YCP నేతలు. దీక్షలతో రాష్ట్రానికి ఏం లాభం చేకూరదన్న బాబు… ఇప్పుడెలా చేస్తున్నారని మండిపడ్డారు. దీక్ష కోసం ప్రజా సోమ్మును ఎలా వృధా చేస్తున్నారని ప్రశ్నించారు.

బాబు దీక్షకు మద్దతుగా ఇవాళ(గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ నేతలు.

Posted in Uncategorized

Latest Updates