ప్రధాని కుర్చీ కోసమే ప్రతిపక్షం ఆరాటం: మోడీ

అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారని తాము ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడంలో విఫలమై ఓ అనవసరమైన హగ్ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్‌ గాంధీనుద్దేశించి అన్నారు. ప్రతిపక్షం ప్రధాని కుర్చీ కోసం మాత్రమే చూస్తుందని ఆరోపించారు. శనివారం (జూలై-21) ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోజా ప్రాంతంలో నిర్వహించిన ‘కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీ’లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని కుర్చీ కోసమే కాంగ్రెస్ ఆరాటపడుతోందన్నారు ఆ విషయం నిన్న లోక్‌సభలో నిరూపితమైందన్నారు. వాళ్లు దేశం కోసమో లేదా దేశంలోని పేద ప్రజల కోసమో పోరాడటం లేదన్నారు. ప్రధాని కుర్చీ కోసం పేదలు, యువత, రైతులను పూర్తిగా మరిచిపోయారన్నారు. నాలుగేళ్లుగా మీకోసం నేను సేవలను అందిస్తూ ఉన్నాను… ఏదైనా తప్పు చేశానా అని ప్రశ్నించారు. కేవలం పేదల కోసం, దేశం కోసం మాత్రమే పని చేస్తున్నానని తెలిపారు మోడీ.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తాను చేసి నేరమన్నారు ప్రధాని మోడీ. శుక్రవారం పార్లమెంటు వేదికగా మాపై అపనమ్మకం కలగడానికి కారణమేమిటని ప్రశ్నించానని… అందుకు సమాధానం ఇవ్వడంలో విఫలమై.. అనవసరమైన కౌగిలింత ఇచ్చారని… మోడీ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.

Posted in Uncategorized

Latest Updates