ప్రధాని పదవి పై తర్వాత మాట్లాడుదాం…ముందు బీజేపీని ఓడిద్దాం

ఎన్నికల్లో ముందు బీజేపీని ఓడించుదాం.. తర్వాత అందరం కూర్చొని ప్రధాని పదవిపై మాట్లాడుదామన్నారు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ .కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన ప్రధాని మమతా బెనర్జీ స్పందించారు. అయితే ఈ కీలకమైన అంశంపై ఆమె ఆచితూచి మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే  మీడియాతో మాట్లాడారు. మమతా వ్యాఖ్యలను బట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేనట్లు మరోసారి స్పష్టమైంది.

ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా వచ్చే ఏడాది జనవరి 19న తాను చేపట్టబోయే మెగా ర్యాలీకి మద్దతుగా రావాలని కోరుతూ వివిధ పక్షాల నేతలను మమత బెనర్జీ కలుస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించగా.. అందరినీ కలవడం తన బాధ్యత అని చెప్పారు మమత.

Posted in Uncategorized

Latest Updates