ప్రధాని మోడీతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం: 16 అంశాలపై చర్చ

ఢిల్లీలో సీఎం కేసీఆర్… ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలతో సహా 16 అంశాలపై మోడీతో చర్చించారు కేసీఆర్.  హైకోర్టు విభజన, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ లోని  బిల్డింగ్స్,HODల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని కోరారు. రిజర్వేషన్ల పెంపు, కొత్త సెక్రటేరియట్ కోసం బైసన్ పోలో గ్రౌండ్, రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖ భూములు అంశంపై చర్చించారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో IIM ఏర్పాటు, కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునరుద్దరణ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) జహీరాబాద్ కోసం నిధుల విడుదల, వరంగల్‌లో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధుల విడుదల, కృష్ణా జలాలా వివాదం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన తరగతుల కోసం 450 కోట్లు గ్రాంట్స్ విడుదల, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన తదితర అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates