ప్రధాని సీటు కోసమే అపోజిషన్ ఆరాటం : అనంతకుమార్

ప్రధానమంత్రి పదవి కోసం అపోజిషన్ పార్టీలన్నీ తీవ్రంగా పోటీ పడుతున్నాయన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్. తానే ప్రధానినని రాహుల్ ఇప్పటికే చెప్పారని.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీనే ప్రధాని అవుతారని  చెబుతున్నారన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాట మార్చి.. బీజేపీ వ్యతిరేకంగా పోరాడే వాళ్లెవరైనా ప్రధాని కావచ్చొంటున్నారని విమర్శించారు అనంతకుమార్. ఇక.. వచ్చే ఎన్నికల్లోనూ ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలవదన్నారు.

Posted in Uncategorized

Latest Updates