ప్రపంచంలోనే కొత్త అధ్యాయం : అమెరికా డిమాండ్లకు దిగొచ్చిన ఉత్తరకొరియా

trump-kim-meetకొత్త అధ్యాయానికి తెరతీసింది ప్రపంచం. సింగపూర్ వేదికగా అమెరికా – ఉత్తరకొరియా అధినేతల భేటీని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ వీరి భేటీ నుంచి రావటం విశేషం. అమెరికా విధించిన అన్ని డిమాండ్లను ఉత్తరకొరియా అధినేత కిమ్ అంగీకరించినట్లు చెబుతున్నారు. 40 నిమిషాలు ఫేస్ టూ ఫేస్ మాట్లాడుతున్న ట్రంప్ – కిమ్.. ప్రపంచ శాంతి కోసం ఏకగ్రీవంగా అంగీకరించారు. సింగపూర్ సెంటపోలోని కెపెల్లా ద్వీపంలో చర్చల తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేయటం ఊహించని పరిణామంగా భావిస్తున్నారు విశ్లేషకులు. 65 సంవత్సరాలుగా ఉప్పు – నిప్పుగా ఉన్న రెండు దేశాలు.. ఇప్పుడు అధ్యక్షుల స్థాయిలో ఫస్ట్ టైం భేటీ అవ్వటంతో.. ఉత్తరకొరియా ఏ విధంగా దిగివచ్చిందో అర్థం అవుతోంది.

అణు నిరాయుధీకరణకు సహకరించాలని ట్రంప్.. కిమ్ కు సూచించారు. ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇచ్చారు.  దానికి అంగీకరిస్తే ఆర్థిక సాయం అందిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో కిమ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యేక హామీకి కిమ్ సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచనలో కిమ్ ఉన్నారు. ఈ క్రమంలోనే.. అణు నిరాయుధీ కరణకు ఒప్పుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పట్టుబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆర్థిక, ఆహార ఉంది. దీన్ని అధిగమించాలంటే అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి. ఐక్యరాజ్యసమితి కూడా అమెరికా ఒత్తిడితో తీవ్ర ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే నాలుగేళ్లుగా ఉత్తరకొరియా ఒంటరి అయ్యింది. ఇప్పుడు ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చైనా, రష్యా దేశాలు మాత్రం అమెరికాను ఎదిరించి ఉత్తరకొరియాకు సాయం చేస్తున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు లేదు. మరోవైపు చైనాపై అమెరికా వాణిజ్య పరంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. తప్పని, విధిలేని పరిస్థితుల్లో చైనా సహకారంతో దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు మొదటగా ఒప్పుకున్నారు కిమ్. దక్షిణి కొరియా రాయబారంతో అమెరికా అధ్యక్షుడు కిమ్ తో భేటీ అయ్యారు. ప్రపంచ శాంతి కోసం అణ్వాయుధాలను నిర్వీర్యం చేయటంతో పాటు ఉత్తరకొరియాలో విదేశీ పెట్టుబడులకు నిబంధనలు మార్చటం వంటి అమెరికా డిమాండ్లను ఒప్పుకుంటున్నారు కిమ్. తద్వారా ఉత్తరకొరియాపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయటంతోపాటు అభివృద్ధికి అమెరికా కట్టుబడి ఉంటుంది. ఈ ప్రాతిపదికనే అమెరికా – ఉత్తరకొరియా మధ్య ఒప్పందం కూడా జరగొచ్చు..

Posted in Uncategorized

Latest Updates