ప్రపంచంలోనే తొలిసారి ఫేస్ రికగ్ననైజేషన్ సేవలు

ప్రపంచంలోనే తొలిసారి ఫేస్ రికగ్ననైజేషన్ ను సింగపూర్ లో అందుబాటులో వచ్చింది. అయితే ఈ ఫేస్ రికగ్ననైజేషన్ ను  న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ఫేస్ రికగ్ననైజేషన్ వల్ల న్యాయ వ్యవస్థలో అనేకసమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు వచ్చే ఏడాది నుండి ఈ సౌకర్యం నగరాలతో పాటు అన్నీ కార్యాలయాల్లో ఈ ఫేస్ రికగ్ననైషన్ అందుబాటులోకి తెస్తామని దాని సృష్టికర్తలు తెలిపారు. దీనివల్ల రోజువారీ పనుల్లో ఉపయోగించే పాస్ వర్డ్, సెక్యూరిటీ డాంగిల్ ను వినియోగించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ముఖ్యంగా ఈ ఫేస్ రికగ్ననైజేషన్ ద్వారా బ్యాంకులతో అవసరం లేకుండా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.  మా పౌరులు మరియు వ్యాపారాల ప్రయోజనం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసి ఇన్నోవేటీవ్ గా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు  సింగపూర్ టెక్నాలజీ ఏజెన్సీ గోవ్టెక్ ప్రతినిధులు క్వాక్ క్యూక్ సిన్ తెలిపారు.

Latest Updates