ప్రపంచంలోనే లాస్ట్ : 4G స్పీడ్ లో దరిద్రంగా ఉన్నాం

4G వచ్చేసింది.. నో బఫరింగ్.. అలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది.. ఎంత గొప్ప టెక్నాలజీ అంటూ ఊదరగొట్టాం.. అంతెందుకు సరిగ్గా నాలుగు రోజు క్రితం 5G టెక్నాలజీ కోసం స్పీడన్ కంపెనీతో కలిసి ఢిల్లీ ఐఐటీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఓపెన్ చేస్తుందని సగర్వంగా ప్రకటించేసుకున్నాం.. ఇప్పుడు అసలు విషయం తెలిసి అందరూ మొబైల్ ఫోన్లను.. తలకేసి కొట్టుకుంటున్నారు. మన దేశంలో 4జీ స్పీడ్ తెలిసి నోరెళ్లబెడుతున్నారు.. మన ప్లేస్ ఎక్కడో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో 124 దేశాల్లో 4జీ టెక్నాలజీ ఉంటే.. స్పీడ్ లో భారతదేశం స్థానం 109. మరో షాకింగ్ ఏంటో తెలుసా.. మన కంటే శ్రీలంక, మయన్మార్, పాకిస్థాన్ దేశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.

శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్ దేశాల్లో 4జీ యావరేజ్ డౌన్ లోడ్ స్పీడ్ 13.56MBPS అయితే.. మన దేశంలో 9.12 MBPSగానే ఉందని.. ఓక్లా అనే స్పీడ్ టెస్ట్ కంపెనీ సర్వే చేసి మరీ చెప్పింది. 4జీ టెక్నాలజీ అందులోబాటు వచ్చిన తర్వాత కూడా వీడియోలు బఫరింగ్ అవుతూనే ఉన్నాయని చెప్పింది. ఆఫర్స్, కస్టమర్లను పెంచుకునే దిశలోనే కంపెనీలు ఉన్నాయని..  మరిన్న టవర్స్ ఏర్పాట్లు, మెరుగైన సేవలు అందించటంపై మాత్రం దృష్టి పెట్టటం లేదని సర్వేలో తేలింది. ఇండియాలో రోజురోజుకీ పెరుగుతున్న మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కూడా 4జీ స్పీడ్ పడిపోవటానికి ఓ కారణంగా విశ్లేషించింది సర్వే. ఏది ఏమైనా 4జీ స్పీడ్ లో మాత్రం మన స్థానం చాలా దరిద్రంగా ఉంది..

Posted in Uncategorized

Latest Updates