ప్రపంచంలో 12వ ధనిక నగరంగా ముంబై

MUMBAIవరల్డ్ వైడ్ గా అత్యంత ధనిక నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై చోటు దక్కించుకుంది. న్యూ వరల్డ్‌ వెల్త్‌ ప్రపంచవ్యాప్తంగా సంపన్న నగరాల లిస్టును రూపొందించింది. మొత్తం 15 నగరాలతో ఉన్న ఈ జాబితాలో ముంబై12 ధనిక నగరంగా నిలిచింది. నగరంలో ప్రైవేటు ఆస్తులను లెక్కలోకి తీసుకొని ఈ లిస్టును రూపొందిస్తారు. బిలియనీర్ల టాప్‌ టెన్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న ముంబైలో దాదాపు 28 మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది. నగరంలో మొత్తం సంపద దాదాపు రూ.61.75 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో కూడా ముంబైకి స్తానం దక్కనున్నదని.రాబోయే పదేళ్లలో ఇక్కడ మురింత సంపద పెరుగుతుందని న్యూ వరల్డ్‌ వెల్త్‌ తెలిపింది.  ఈ జాబితాలో న్యూయార్క్‌( రూ.195 లక్షల కోట్లు) మొదటి స్థానంలో  నిలిచింది.

 

 

Posted in Uncategorized

Latest Updates