ప్రపంచం గర్వపడేలా : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో తొలి ఆదివాసి

roshan-kumar

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). ఈ మాట ఒక్కటి చాలు పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోని టాప్ కంపెనీలు అన్నీ కూడా ఓ సారి ఆలోచిస్తాయి. ఇక్కడ సీటు రావటం అంటే మాటలు కాదు.. వచ్చినా లక్షలు ఖర్చవుతాయి. అంతేకాదు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఉండేవారు కోటీశ్వరులు, వారి బిడ్డలే. సామాన్యులు, మధ్య తరగతి వారికే కాకుండా.. డబ్బున్న బడాబాబులు సైతం సీట్ల కోసం రికమండేషన్స్ చేయించుకుంటుంటారు. అలాంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) చరిత్రలో మొదటిసారి.. ఫస్ట్ టైం ఓ ఆదివాసీకి ఎంట్రీ లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసి పారిశ్రామికవేత్త ఎంపికై చరిత్ర సృష్టించాడు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామానికి చెందిన అత్రం రోషన్ కుమార్ హైదరాబాద్ లోని ISBలో చేరాడు. సంస్థలోని నిపుణులు, విద్యావేత్తలతో చర్చించడం నా జీవితం ధన్యమైందని.. నా కల నెరవేరింది అంటున్నాడు రోషన్. అగ్రికల్చర్ B.Tech పూర్తి చేసిన తర్వాత.. ప్రఖ్యాతిగాంచిన ఈ బిజినెస్ స్కూల్ లో చేరాడు.

సీఎం స్టేట్ ట్రైబల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకం కింద ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఏడుగురు ఆదివాసి యువకులు ఎంపికయ్యారు. అందులో రోషన్ కుమార్ ఒకరు. ప్రభుత్వ పథకం కింద ఉట్నూరులో రూ.15 లక్షల వ్యయంతో పప్పు ధ్యానాల ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రోషన్. రుణం కోసం 27 బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకున్నాడు. 98 సార్లు బ్యాంకుల చుట్టు తిరిగాడు. అప్పు దొరకలేదు. ఆయన దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించాయి. నిరాశ చెందిన రోషన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ దారి చూపించాడు. ప్రతిభావంతుడైన ఆదివాసి యువకుడి సమస్య.. కలెక్టర్ దివ్య దేవరాజన్ దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ చొరవ తీసుకుని రోషన్ కు బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించాడు. దీంతో ఉట్నూరులో ARK ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశాడు. మూడు నెలల్లో 48 ఆశ్రమ పాఠశాలలకు 400 క్వింటాళ్ల కంది పప్పును సరఫరా చేసే స్థాయికి సంస్థ చేరుకుంది. రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని గిరిజన హాస్టళ్లకు ఆహార ధ్యానాలను సరఫరా చేస్తానంటున్నాడు రోషన్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో వ్యాపారంలో మెళకులతోపాటు.. పారిశ్రామికత వేత్తగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇందులో జాయిన్ అయిన తొలి ఆదివాసీని కూడా కావటం గర్వంగా ఉందంటున్నాడు. ఆదివాసీల్లోనూ ఎంతో ప్రతిభ ఉందని.. గుర్తించి ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతాలే చేస్తారంటున్నాడు రోషన్..

Posted in Uncategorized

Latest Updates