ప్రపంచం చూపు సింగపూర్ వైపు : ట్రంప్ – కిమ్ రాకతో హైటెన్షన్

TRUPMప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమావేశానికి ఇద్దరు నేతలు రెడీ అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీకి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరు నేతలు సింగపూర్ చేరుకున్నారు. జూన్ 12వ తేదీ ఉదయం రెండు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నాయి.

రెండ్రోజుల ముందుగానే సింగపూర్ చేరుకున్నారు ఇద్దరు నేతలు. చాంగై ఎయిర్ పోర్టుకు తొలుత వచ్చిన కిమ్ కు స్వాగతం పలికారు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్. అనంతరం సింగపూర్ ప్రధాని లీ లూంగ్ తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సింగపూర్ చేరుకున్నారు. కెనడాలో జరిగిన జీ 7 సమ్మిట్ ను ముగించుకుని నేరుగా సింగపూర్ వచ్చారు.

కిమ్ తో భేటీపై ట్రంప్ ట్వీట్లు చేశారు. ప్రపంచ శాంతి కోసమే ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమైనట్లు ప్రకటించారు. చర్చల్లో కిమ్ ధోరణి నచ్చకుంటే సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరిస్తానంటూ హెచ్చరించారు. కిమ్ వైఖరి మారకుంటే ఏ చర్యకైనా వెనకాడబోమన్నారు అమెరికా అధ్యక్షుడు. మంగళవారం (జూన్-12) జరగనున్న డొనాల్డ్ ట్రంప్, కిమ్ చారిత్రక సమావేశానికి సెంటోజా ఐలాండ్ వేదికైంది. రిసార్ట్ దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది సింగపూర్.

Posted in Uncategorized

Latest Updates