ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన యూట్యూబ్

వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌ సైట్‌ యూట్యూబ్‌ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో వరల్డ్ వైడ్ గా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. ఈ సమస్య రెండు గంటలపాటు కొనసాగింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్‌ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates