ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చైనా నడిపిస్తోంది : జిన్ పింగ్

JIMPINGప్రపంచ ఆర్థిక వ్యవస్థను చైనా నడిపిస్తోందన్నారు ఆ దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్. తమ దేశంలో అమలవుతున్న సంస్కరణలు గొప్ప విజయాలు సాధిస్తున్నాయన్నారు. చైనాలోని హైనన్ లో జరుగుతున్న బావ్ ఏషియా సదస్సులో జిన్ పింగ్ మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆటో, ఇతర ఉత్పత్తుల దిగుమతుల టారిఫ్ రేట్లను తగ్గిస్తామన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటామన్నారు. చైనా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు ఆంక్షలు విధించడం ఆపుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు జిన్ పింగ్.

 

Posted in Uncategorized

Latest Updates