ప్రపంచ చెత్త రికార్డ్ ఇది : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసింది

టెస్ట్ హోదా వచ్చిన తర్వాత ఆప్ఘనిస్థాన్ ఆడిన తొలి టెస్ట్ లో ఆ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది.  బెంగళూరు వేదికగా భారత్,ఆఫ్ఘనిస్ధాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో 262 పరుగుల ఆధిక్యతతో భారీ విజయం సాధించింది ఇండియా. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ రెండో రోజే ముగిసిపోయింది. దీంతో ఆప్ఘనిస్తాన్ చెత్త రికార్డు సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే 365 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన ఆప్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 103 పరుగులకే ఆలౌట్ అయ్యి పరాజయాన్ని మూటగట్టుకుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 స్కోరుతో ఇవాళ (శుక్రవారం-15) రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు జోడించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆష్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 103 పరుగులకే ఆలౌటౌవడంతో ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్ 96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.

Posted in Uncategorized

Latest Updates