ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌: ప్రిక్వార్టర్స్‌కి కిదాంబి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్ళాడు. మెన్స్ సింగిల్స్‌లో భాగంగా రెండో రౌండ్లో శ్రీకాంత్‌ స్పెయిన్‌కు చెందిన పాబ్లో అబియాన్‌తో పోటీపడ్డాడు.ఫస్ట్ గేమ్‌ను ఈజీగా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ విరుచుకుపడ్డాడు.  మొత్తం 62నిమిషాల పాటు సాగిన పోరులో శ్రీకాంత్‌ 21-15, 12-21, 21-14తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

Posted in Uncategorized

Latest Updates