ప్రపంచ రికార్డుకు గుడ్ బై : 66 ఏళ్ల నుంచి పెంచుకున్న గోళ్లను కత్తిరించాడు

ప్రపంచంలో అత్యంత పొడవైన గోళ్లతో వరల్డ్ రికార్డు సృష్టించిన వ్యక్తి  శ్రీధర్ ఛిల్లాల్. 82 ఏళ్ల శ్రీధర్ ఛిల్లాల్ సుమారు 66 ఏళ్ల తర్వాత తన గోళ్లను కత్తిరించుకున్నాడు. శ్రీధర్ ఛిల్లాల్ 1952 నుంచి తన ఎడమచేతి గోళ్లు కత్తిరించుకోకుండా ఉన్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో జరుగనున్న నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీలో ఛిల్లాల్ తన గోళ్లను బుధవారం (జూలై-11) కత్తిరించుకున్నారు.

అయితే తన గోళ్లను సజీవంగా మ్యూజియంలో ఉంచాలని అమెరికా ప్రాంఛైజీ సంస్థ మ్యూజియం రిప్లెయిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌ కు విజ్ఞప్తి చేశారు శ్రీధర్ చిల్లాల్. శ్రీధర్ ఛిల్లాల్ బొటనవేలు గోరు 197.8 సెంటీ మీటర్ల పొడవు..మొత్తం గోళ్ల పొడవు 909.6 సెంటిమీటర్లు. దీంతో ఒకే చేతిలో అత్యంత పొడవైన గోళ్లున్న వ్యక్తిగా 2016 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు శ్రీధర్ చిల్లాల్.

పుణెకు చెందిన శ్రీధర్ చిల్లాల్ గత 66 ఏండ్లుగా తన ఎడమ చేతి గోర్లు పెంచుతున్నాడు. ఈ గోర్లే ప్రపంచంలో అత్యంత పొడవైనవిగా గుర్తింపురాగా..  2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నాయి. ప్రస్తుతం 82 ఏండ్ల వయసున్న శ్రీధర్ చిల్లాల్.. 1952 నుంచి కత్తిరించకుండా గోర్లను పెంచుకున్నాడు. 66 ఏండ్ల తర్వాత తన పొడవాటి గోర్లను కత్తిరించుకోవాలని చిల్లాల్ నిర్ణయించుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates