ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి : విద్యుత్ వెలుగుల్లో చర్చీలు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల సందడి మొదలైంది. క్రిస్మస్ పండగకు ప్రధాన చర్చిలతో పాటు కాలనీల్లోని చర్చిలు రెడీ అయ్యాయి. పండుగ రోజు ప్రత్యేక ప్రార్థనలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఏడాదికొకసారి జరుపుకునే పండుగ కావడంతో.. చర్చిలను రకరకాల లైట్స్ తో అలంకరించారు. క్రిస్మస్ ట్రీని గిఫ్ట్స్, బాల్స్ తో డెకరేట్ చేశారు.  సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ దగ్గరున్న చర్చిలో ప్రార్థనలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు పాస్టర్లు. ఒకేసారి రెండు వేలకు పైగా ప్రేయర్ చేసేలా స్థలాన్ని ఏర్పాటు చేశారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలో ప్రార్థన ఉంటుందన్నారు. పండుగ సందర్భంగా పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో పలుచోట్ల పేదలకు ప్రభుత్వం అందించే క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు నేతలు. క్రిస్మస్ సంబరాల్లో చిన్న పిల్లలతో డ్రామా, డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ గేమ్స్ ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates