ప్రపంచ శాంతి కోసం భారత్ సిద్ధం : మోడీ

ప్రపంచ శాంతి కోసం భారత్‌  ఏమైన చేయడానికి సిద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  ఇవాళ మన్ కీ బాత్ 48వ ఎడిషన్‌ కార్యక్రమంల పలు అంశాలపై మాట్లాడారు. దేశాభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యల పట్ల మాత్రం కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పారు మోడీ. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశ సైనికుల ప్రాణాలను తీస్తున్న పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులను ఆయన గుర్తు చేశారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశ వ్యాప్తంగా మెరుపు దాడుల దినోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. పాక్‌ ఉగ్రవాదులపై భారత సైన్యం జరుపుతున్న పోరాటం అమూల్యమైనది కొనియాడారు. భారత సార్వభౌమాధికారానికి నిలువెత్తు నిదర్శనం సైనిక దళామని ఆయన వర్ణించారు. దేశ వ్యాప్తంగా త్రివిధ దళాల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ భద్రతకు వారు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రకృతి వైపరిత్యల సమయంలో వారు చేస్తున్న సాహసాలను, సేవలు మెచ్చుకున్నారు మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates