ప్రపోజల్ అదిరింది : కామన్ వెల్త్ స్టేడియం వారి ప్రేమకు వేదిక అయింది

joneతమ ప్రియురాలికి తమ ప్రేమను తెలియజేయడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో ఉంటారు. ఎత్తైన కొండల మీదకు తీసుకెళ్లి తమ ప్రేమను తెలియజేయడం, పార్క్ లో ఏకాంతసమయంలో తమ ప్రేమను వ్యక్త పరచడం, ఫోన్ లో మెసేజ్ ద్వారా, ఇలా చాలా రకాలుగా తమ ప్రేయను తమ ప్రియురాలికి తెలియజేస్తుంటారు ప్రేమికులు. అయితే ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి కామన్ వెల్త్ స్టేడియాన్ని ఎంచుకొన్నాడు. అతడే ఇంగ్లండ్ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్ జమ్మెల్‌ అండర్‌సన్‌.‌ బాస్కెట్‌ బాల్‌ కోర్టులో అందరూ చూస్తుండగా తన ప్రేమను వ్యక్తపరిచి గర్ల్ ఫ్రెండ్‌ ను ఆశ్చర్యపరిచాడు.
ఆదివారం(ఏప్రిల్-8)కామెరూన్ బాస్కెట్‌ బాల్‌ టీమ్ పై ఇంగ్లాండ్‌ టీమ్ విజయం సాధించింది. మ్యాచ్ తరువాత జట్టు సభ్యులంతా కోర్టులోనే ఒక దగ్గరకు చేరారు. ఆ సమయంలో మోకాళ్ల మీద కూర్చుని మ్యాచ్‌ చూసేందుకు కోర్టు బయట ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ జార్జియా జోన్స్‌ కు అండర్‌సన్ ప్రపోజ్‌ చేసి అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. అండర్‌సన్‌ ప్రపోజల్‌ కు ఉబ్బితబ్బిబయిన జోన్స్‌ అతడి దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టి అతడి ప్రపోజల్ ను అంగీకరించింది. వెంటనే జోన్స్ వేలికి ఉంగరం తొడిగాడు అండర్‌సన్‌. జోన్స్‌ కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌ లో పాల్గొనేందుకు వచ్చిన బాస్కెట్‌ బాల్‌ మహిళా జట్టు సభ్యురాలు. తన ప్రేమను అంగీకరించినందుకు అండర్‌సన్‌ తెగ సంబరపడిపోయాడు. ‌వీళ్ల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Posted in Uncategorized

Latest Updates