ప్రభాస్‌ సినిమాకి ఫ్రెంచ్‌ టైటిల్‌?!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ని మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూసేద్దామా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు. ప్రెస్టీజియస్ ఫిలిం ‘సాహో’ సినిమా షూటింగ్ పూర్తై… రిలీజ్ కావడానికి చాలా టైమ్ పట్టేటట్టే ఉంది. ఆ సినిమా కంటే ముందే… మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

‘జిల్‌’ మూవీ దర్శకుడు రాధాకృష్ణన్‌తో ఓ సినిమా కమిటయ్యాడు ప్రభాస్‌. ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. “సాహో” కంటే ముందే ఇది రిలీజ్‌ అవుతుందని టాక్. ఈ సినిమా కోసం ఒక విచిత్రమైన టైటిల్‌ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదేంటో తెలుసా? ‘అమూర్‌’ అట. అంటే ఫ్రెంచి భాషలో ‘ప్రేమ’ అని అర్థం. ఒక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ కావడంతో ఆ పదం బాగుంటుందనిపించిందట డైరెక్టర్‌కి. అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ అదే పేరు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates