ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ కేసు : హైకోర్టు డివిజన్ బెంచ్ కు బదిలీ

హైదరాబాద్ రాయదుర్గంలో తన గెస్ట్ హౌజ్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో.. హైకోర్టుకు వెళ్లారు సినీ హీరో ప్రభాస్. పాన్ మక్తా సర్వే నెంబర్ 46 లో ఉన్న 84 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో… అక్కడి అక్రమ కట్టడాలను కూల్చేశారు అధికారులు. ప్రభాస్ గెస్ట్ హౌజ్ గేటుకు తాళం వేసి.. సీజ్ చేసినట్టుగా నోటీసు అంటించారు. దీనిపై… ప్రభాస్ హైకోర్టుకు వెళ్లాడు. ఆయన తరఫున లాయర్లు వేసిన పిటిషన్ ను బుధవారం మధ్యాహ్నం విచారణ చేసింది హైకోర్టు.

రాయదుర్గంలోని పాన్ మక్తలో ఉన్న భూమి ప్రభుత్వ భూమి అని గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది. తాము కొనుగోలు చేసింది రాయదుర్గంలోని పాన్ మక్త స్థలమే అని కోర్టుకు తెలిపారు పిటిషనర్. గతంలో తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్ కు కేసును బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది విజ్ఞప్తిచేశారు. దీంతో…సింగిల్ బెంచ్ నుంచి… మళ్ళీ డివిజన్ బెంచ్ కు కేసును బదిలీ చేసింది కోర్ట్. రేపు గురువారం డివిజన్ బెంచ్ లో మరోసారి వాదనలు జరగనున్నాయి. గురువారం డివిజన్ బెంచ్ ముందుకు ఈ కేసు రానుంది.

Posted in Uncategorized

Latest Updates