ప్రభాస్ చేతుల మీదుగా ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌

prabhasబ్రూస్‌ లీ, ఎంతవాడుగాని చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు కూడా.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవ తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’. ఈ సినిమా  ట్రైల‌ర్ ను శుక్ర‌వారం(ఏప్రిల్-13) హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

‘కుట్రమ్‌ 23’ సినిమాను  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ కలిసి తెలుగులోకి అనువదిస్తున్నారు. సినిమాకి ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పిస్తున్న ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన ఈ సినిమాలో సీనియర్‌ నటుడు జయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీల‌కపాత్రల్లో నటించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Posted in Uncategorized

Latest Updates