ప్రభుత్వం దిగొచ్చింది : పిల్లల పోరాటంతో తిరిగొచ్చిన భగవాన్ మాస్టారు

bhagwan masterసరిగ్గా వారం రోజుల క్రితం.. నిజంగానే భగవానుడు.. ఈ టీచర్ కోసం స్కూల్ అంతా ఏడ్చిది.. వెళ్లొద్దని కాళ్లపై పడింది అనే టైటిల్ తో వచ్చిన వార్త గుర్తొచ్చింది కదా. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూర్ జిల్లాలోని వెళియగరమ్ గవర్నమెంట్ హైస్కూల్. ఆ స్కూల్ లో జి.భగవాన్ (28) ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెబుతాడు. నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. పిల్లలతో టీచర్ గా కాకుండా.. ఓ ఫ్రెండ్, అన్నగా ఉండే వాడు. అలాంటి మాస్టారుకి బదిలీ అయ్యింది. అయితే స్కూల్ లోని పిల్లలు అంతా ఏడ్చారు.. వెళ్లొద్దని కాళ్లావేళ్లా పడ్డారు. ధర్నాలు చేశారు పిల్లలు. స్కూల్ కు వచ్చేది లేదని ఆందోళన చేశారు. పిల్లల ఆందోళన, పేరంట్స్ డిమాండ్ తో అప్పట్లోనే భగవాస్ మాస్టారు బదిలీకి తాత్కాలిక బ్రేక్ వేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంది. బదిలీని రద్దు చేస్తూ తమిళనాడు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

భగవాన్ మాస్టారు బదిలీ రద్దు కావటం, మళ్లీ స్కూల్ కు తిరిగి రావటంతో పిల్లలు పండుగ చేసుకున్నారు. సంబురాలు చేసుకున్నారు. ఆ పిల్లల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భగవాన్ మాస్టారు బదిలీ అయినప్పటి నుంచి పిల్లలు డల్ గా ఉంటున్నారని.. స్కూల్ కు వెళ్లాలి అంటే ఏదో బాధగా వెళుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు భగవాన్ మాస్టారు తిరిగి వచ్చారన్న విషయం తెలియటంతో.. పరుగు పరుగు వెళ్లారని ఆ పేరంట్స్ చెబుతుంటే అందరూ ఆసక్తిగా, ఆనందంగా వింటున్నారు.. పిల్లల ముఖాల్లో కూడా ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates