ప్రభుత్వానికి మరో ఛాన్స్..దీక్ష చేయడంలేదు : హజారే

అహ్మద్ నగర్ : అన్నా హజారే వెనక్కి తగ్గారు. లోక్‌ పాల్ నియామకం డిమాండ్‌ పై గాంధీ జయంతి సందర్భంగా( అక్టోబర్-2) ఇవాళ్టి నుంచి నిరాహార దీక్ష చేస్తానని గతంలో ప్రకటించారు. అయితే ఈ దీక్షను ప్రస్తుతం వాయిదా వేసినట్లు తెలిపారు హజారే. మహారాష్ట్ర మంత్రి గిరిరాజ్ మహాజన్‌ తో ఇవాళ (అక్టోబర్-2) చర్చలు జరిపారు అన్నా హజారే. చర్చల తర్వాత నిరాహార దీక్షను వాయిదా వేయాలనే నిర్ణయాన్ని హజారే తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాబోయే నాలుగు నెలల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, లేనిచో ..అప్పుడు నిరవధిక నిరాహార దీక్ష చేపడుతానని చెప్పారు హజారే.  లోక్ పాల్ పై ప్రభుత్వానికి చివరగా మరో ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. తాను చేపట్టిన లోక్‌ పాల్ ఆందోళన తర్వాతే BJP అధికారంలోకి వచ్చిందని, లోక్‌ పాల్ ఏర్పాటు చేస్తామంటూ.. ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టుకోలేకపోయిందన్నారు. నాలుగేళ్లుగా హామీలే కానీ.. లోక్‌ పాల్, లోకాయుక్తను ఏర్పాటు చేయలేకపోయిందని.. ఇటీవల ప్రధాని మోడీకి రాసిన లెటర్ లో తెలిపారు అన్నా హజారే.

 

 

Posted in Uncategorized

Latest Updates