ప్రభుత్వ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చండి.. కోర్టు ఆదేశం

కృష్ణా జిల్లా : కాంట్రాక్టర్ అప్పులు తీర్చేందుకు.. ఇరిగేషన్ శాఖ ఆస్తులను వేలం వేయాలని మచిలీపట్నం కోర్టు అధికారులకు సూచించింది. నీటిపారుదల శాఖ భూములను వేలం వేసేందుకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం తనకు బకాయి పడిన రూ.407 కోట్లను చెల్లించాలంటూ.. మచిలీపట్నం న్యాయస్థానంలో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారు పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్. ఇవ్వాల్సిన అసలుకు రూ.122 కోట్ల వడ్డీ కలిపి.. రూ.407 కోట్లు ఇవ్వాలని పిటిషన్ లో వివరించారు.

2016లో ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుంది కోర్టు. తాజాగా జరిగిన విచారణలో.. మచిలీపట్నం పదో అదనపు జిల్లా కోర్టు జడ్జీ రజినీ కీలకమైన కామెంట్స్ చేశారు. వడ్డీతో సహా మొత్తం రూ.407 కోట్లు చెల్లించాల్సిందే అన్నారు. అందుకోసం.. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన 24.71 ఎకరాల  స్వరాజ్య మైదానం, జగ్గయ్యపేటలోని 17.80 ఎకరాల భూమిని వేలం వేసేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 10వ తేదీలోపు ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువ పత్రాలను కోర్టుకు ఇవ్వాలని 10వ అదనపు జిల్లా జడ్జి రజిని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates