ప్రభుత్వ పధకాలతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి : కడియం

kadiరైతుబంధు పథకం రాబంధు పథకం అన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. లేదంటే వచ్చే ఎన్నికల్లో రైతులే కాంగ్రెస్ కు బుద్ది చెబుతారన్నారు. రైతుబంధుకు వస్తున్న స్పందన ఓర్వలేకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయని విమర్శించారు. రైతుబంధు, చెక్కుల పంపిణీపై జనగామలో రైతుసమన్వయ సమితి కార్యకర్తలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో కడియం పాల్గొన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates