ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యే లక్ష్యం : కడియం

ప్రభుత్వ పాఠశాలల్లో  మెరుగైన   విద్య అందించే  లక్ష్యంతో  ప్రభుత్వం  పనిచేస్తోందన్నారు  విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.  హన్మకొండలోని  రూరల్ జిల్లా  కలెక్టరేట్లో   వరంగల్ అర్బన్,  రూరల్,  జనగామ జిల్లాల విద్యాశాఖ  అధికారులతో  కడియం శ్రీహరి  సమీక్షించారు. ప్రతీ స్కూళ్లో  టాయిలెట్స్, నీటి సరఫరా,  విద్యుత్, అదనపు తరగతి  గదులు  ఉండేలా  చూడాలని  కడియం ఆదేశించారు.  ప్రహరీ గోడలకు  అవసరమైన  నిధులు మంజూరు  చేస్తామని  విద్యాశాఖమంత్రి  అన్నారు. పాఠశాలలో  చదువుకునే  వాతావరణం కల్పించాలన్నారు.  ఉపాధ్యాయుల  బదిలీలతో  ఖాళీ అయిన  స్థానాల్లో  విద్యా వాలంటీర్లను  నియమించుకోవాలని  సూచించారు కడియం.

Posted in Uncategorized

Latest Updates