ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లక్ష నోట్ బుక్స్

JNTUHప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్‌ ను పంపిణీ చేయనుంది జేఎన్టీయూహెచ్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌). యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ద్వారా సుమారు లక్ష నోట్‌బుక్స్‌ పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేసింది. వర్సిటీ నిర్వహించే సెమిస్టర్‌ పరీక్షలకు హాజరైన వారి జవాబు పత్రాలు, గైర్హాజరైన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం తర్వాత ధ్వంసం చేసేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జవాబు పత్రాలు వృథా కాకూడదనే ఉద్ధేశంతో వర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూడేళ్లుగా గైర్హాజరైన వారి జవాబు పత్రాలతో తయారు చేసిన లక్ష నోటు పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ర్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు జేఎన్టీయు అధికారులు. ఈ పుస్తకాల్లో టెన్త్‌ తర్వాత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సమాచారం, వర్సిటీ నిర్వహిస్తోన్న సాంకేతిక విద్యా విభాగాల సమాచారం కూడా పొందుపరిచినట్లు తెలిపింది జేఎన్టీయూహెచ్‌.

Posted in Uncategorized

Latest Updates