ప్రమాదాల నుంచి రెండు రైళ్లను కాపాడిన మత్స్యకారుడు

ఓ ఫిషర్ మ్యాన్ వేగవంతమైన, తెలివైన నిర్ణయం వందలమంది ప్రజల ప్రాణాలను కాపాడింది. ఫిషర్ మ్యాన్ అనుపమ్ బరౌయి తెలివైన నిర్ణయం వల్ల మంగళవారం(జులై-31) ఓ పెద్ద రైలు ప్రమాదం తప్పింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జల్ పాయ్ గురి జిల్లాలోని నందన్ పూర్ కీరార్ పర హాల్ట్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.

జల్ పాయ్ గురి సిటీకి 17కిలోమీటర్ల దూరంలోని నందన్ పూర్ కీరార్ పుర గ్రామంలో నివసిస్తుంటాడు అనుపమ్ బరౌయి. అనుపమ్ చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. ప్రతిరోజులాగే… మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఫిషింగ్ కోసమని ఇంటినుంచి బయల్దేరాడు. ఫిషింగ్ కు వెళ్తున్న సమయంలో… రైల్వే పిల్లర్ 20/9 ద్గగర పట్టాలకు పాండ్రోల్ క్లిప్ లు లేకపోవడాన్ని గమనించాడు. 27 క్లిప్ లు పట్టాలకు లేకపోవడాన్ని చూసిన అనుపమ్ షాక్ అయ్యాడు. అదే సమయంలో… హల్దిబరి-ఎన్ జేపీ ప్యాసింజర్ రైలు, హల్దిబరి-కోల్ కతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు లైన్  పై వస్తున్నాయి. దీంతో వెంటనే తన  చేతిలోని ఫిషింగ్ రాడ్, నెట్, ఇతర సామాన్లనుపడేసి తన ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోని ఓ రెడ్ క్లాత్ ను తీసుకొని స్పాట్ కి వచ్చాడు. పట్టాలపై వస్తున్న రైలుకి ఎదురుగా రెడ్ క్లాత్ ను ఊపుతూ 200 మీటర్లు పరుగెత్తాడు. రెడ్ క్లాత్ పట్టుకొని ట్రైన్ కి ఎదురుగా పరుగెత్తుకుంటూ వస్తున్న  అనుపమ్ ను గుర్తించిన ట్రైన్ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. విషయం తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని సెకన్ల ఆలస్యమైతే వందలాది మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవంటూ అందరూ అనుపమ్ కు కృతజ్ణతలు తెలిపారు. జల్ పాయ్ గురి నుంచి రైల్వే స్టాఫ్ వచ్చి ట్రాక్ రిపేర్ చేసేంతవరకూ రెండు గంటలపాటు రైలు అక్కడే నిలిచిపోయింది. అయితే పట్టాలకు ఉన్న పాండ్రోల్ క్లిప్ లను ఎవరు దొంగిలించారనేదానిపై, దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు RPF ఇన్స్ పెక్టర్ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates