ప్రమాద స్థాయికి చేరిన యమున..పొంగిపోర్లుతున్న గంగా

ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో యమునా నదిలో వరదనీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. యమునా నది పాత రైలు వంతెన దగ్గర నీటిమట్టం 205.52 మీటర్లకు చేరుకోవడంతో రైలు వంతెనను మూసివేయాలని సూచించారు. వరద విపత్తు దృష్ట్యా 27 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. లోతట్టు తీరప్రాంతాల్లో నివాసముంటున్న 3వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరో రెండు రోజులు అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం యంత్రాంగం అలర్టైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.

మరోవైపు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నగరం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు గంగా నది పొంగి పొర్లుతోంది. వాటర్ లెవల్స్ డేంజర్ మార్క్ దాటాయి. దీంతో ఆ రాష్ట్ర సర్కారు.. ప్రభుత్వయత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా NDRF దళాలు చర్యలు చేపట్టాయి.

 

Posted in Uncategorized

Latest Updates