ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గోపికి చైనా ఆహ్వానం

హైదరాబాద్ : ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపికి చైనా ప్రభుత్వం అరుదైన ఆహ్వానం పంపింది. ఈనెల 21 నుంచి 29 వరకు బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ రచనా కేంద్రంలో అంతర్జాతీయ సాహిత్యంపై పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని డాక్టర్ గోపికి ఆహ్వాన లేఖ రాశారు అంతర్జాతీయ రచనా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఝాంగ్ కింఘ్వా. ఇక్కడ నిర్వహించనున్న అనువాద అంశాలు, కావ్య పఠనాలు, సాహిత్య గోష్ఠుల్లో చైనాతో పాటు అమెరికా, క్యూబా, జర్మనీ, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఇండియాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ కార్యక్రమాల్లో చైనా నుంచి ఆరుగురు ప్రతినిధులు, మిగిలిన దేశాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి హాజరవుతారు. భారత్ నుంచి ఎంపికైన ఏకైక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ ఎన్.గోపి కావడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates