ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్

mumbaicentralకదిలే రైలు ఎక్కబోతూ ప్రమాదానికి గురైన ఓ మహిళను సురక్షితంగా కాపాడారు రైల్వే భద్రతా సిబ్బంది. ముంబాయి సెంట్రల్ రైల్వే స్టేషన్ లో బుధవారం(ఫిబ్రవరి21) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నెంబర్ 4 పై ఓ మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నంలో అదుపుతప్పి దాదాపుగా రైలు కిందపడిపోయే స్థితికి చేరింది ఆ మహిళ. దీనిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి తోటి వ్యక్తులతో కలిసి ఆ మహిళను రైలు కింద పడకుండా కాపాడారు. దీంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడటంత మహిళ తనను కాపాడిన రైల్వే భద్రతా సిబ్బందికి కృతజ్ణతలు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates