ప్రయాణికుల చేతివాటం: రైల్వేకు 4వేల కోట్లు నష్టం

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఓ వైపు రైల్వేశాఖ చర్యలు చేపడుతుంటే …మరోవైపు కల్పించిన సౌకర్యాలకే రక్షణ లేకుండా పోతోంది. భద్రత లేకుండా చేస్తున్నది ఎవరో కాదు …రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులే. కొందరు ప్రయాణికుల వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

రైల్వే ప్రయాణికులే రైళ్లలోని బ్లాంకెట్లు, దిండ్లు, బెడ్ షీట్లు, టవల్స్, తదితర వస్తువులు దొంగలించుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే 1.95లక్షల టవల్స్, 81,736 బెడ్‌షీట్లు, 55,573 దిండ్ల కవర్లు, 5,038 దిండ్లు, 7,043 బ్లాంకేట్లు ప్రయాణికులే చోరీ చేశారు. మరిన్ని ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక్కో బెడ్ షీట్ ధర రూ.132 కాగా, టవెల్స్ ధర రూ.22, దిండు ధర రూ. 25.

గత మూడేళ్లలో భారత రైల్వే సుమారు రూ.4,000కోట్ల విలువైన ఆస్థిని నష్టపోయింది. ఇందులో మేజర్ వాటా ప్రయాణికుల దొంగతనాలే కారణమంటున్నారు రైల్వే అధికారులు.రైళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉంటే రైల్వే శాఖ ఛార్జీలను కూడా పెంచే అవకాశం ఉంది. అందుకే ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతోంది రైల్వే శాఖ.

Posted in Uncategorized

Latest Updates