ప్రయాణికుల రక్ష‌ణ కోసం రైల్వే  ‘జీరో ఎఫ్ఐఆర్’

న్యూఢ్లిల్లీ: రైళ్లలో ప్రయాణికుల రక్ష‌ణ కోసం కొత్త మొబైల్ యాప్ ను తీసుకొస్తున్నట్లు ఆర్ పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. రైళ్లలో మహిళలు వేధింపులకు గురైనా, దొంగతనం,గొడవలు జరిగినా కంప్లైంట్ చేసేందుకు మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కంప్లైంట్ చేసేందుకు బాధితులు వచ్చే స్టేషన్ లో ట్రైన్ ఆగేదాకా ఎదురుచూడాల్సిన అవసరాన్ని ఈ యాప్ తప్పిస్తుందన్నారు.

ఇలా అందిన  కంప్లైంట్ ను ‘జీరో ఎఫ్ఐఆర్’ గా వ్యవరిస్తూ వెంటనే యాక్ష‌న్ తీసుకుంటామని తెలిపారు. మధ్యప్రదేశ్ లో రైల్వేశాఖ ఈ యాప్ ను పైలెట్ ప్రాజెక్ట్ గా పరీక్షిస్తోంది. త్వరలో దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates