ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 15 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఎంట్రెన్స్ టెస్టుల దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Updates