ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం : నాయిని  

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందన్నారు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు నాయిని. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన ఘటనపై నాయిని నర్సింహా రెడ్డి స్పందించారు.

ప్రజా ప్రతినిధులను కాల్చి చంపడం దురదృష్టకరం అని అన్నారు. తెలంగాణలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఏపీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశామన్నారు హోంమంత్రి నాయిని.

Posted in Uncategorized

Latest Updates