ప్రశాంతగా JEE మెయిన్స్

jee WARANGALదేశంలోని ప్రతిష్టాత్మకమైన IIT, NIT, IIMలలో ఎంట్రెన్స్ కోసం ఆదివారం (ఏప్రిల్-8) వ‌రంగ‌ల్‌ లో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్స్ ఆఫ్‌లైన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 18 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు నిర్వహించిన పేపర్-1కు 10 వేల 802 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో 10 వేల 519 మంది హాజరైనట్లు తెలిపారు సిటీ కోఆర్డినేటర్ జి.మథ్యాస్‌రెడ్డి. ఉదయం జరిగిన పరీక్షకు 97.38 హాజరు శాతం నమోదైంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించిన పేపర్-2కు 3020 మంది నమోదు చేసుకోగా.. 2 వేల 811 మంది విద్యార్థులు హాజరయ్యారు. 93.03 శాతం హాజరు విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షను ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు సిటీ కోఆర్డినేటర్. ఉదయం నుంచి నగరంలో కురుస్తున్న వర్షంతో విద్యార్థులు కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ ..సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని.. నిమిషం ఆలస్యం నిబంధన వల్ల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు కోఆర్డినేటర్.

Posted in Uncategorized

Latest Updates