ప్రసాదం ఎఫెక్ట్: 1500 మందికి అస్వస్థత

villageill1 శివరాత్రి పర్వదినం రోజున ప్రసాదం తిన్న 1500 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని బర్వాని జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం(ఫిబ్రవరి13) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా శివరాత్రి సందర్భంగా స్థానికంగా ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ భక్తులందరికీ ప్రసాదం అందజేశారు. ఇది తిన్న వారందరూ కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో అస్వస్థతకు గురైన వారందరిని ట్రీట్ మెంట్ కోసం జిల్లా ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
villageill
villageill2

Posted in Uncategorized

Latest Updates