ప్రస్తుతం ఇదే రూల్ : ముందు పాస్ పోర్టు జారీ.. తర్వాత పోలీస్ వెరిఫికేషన్

PASS PORTతత్కాల్ పాస్ పోర్టు జారీని మరింత ఈజీ చేసింది కేంద్రం. ఇంతవరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం తత్కాల్ పాస్ పోర్టు పొందాలంటే IAS లేదా IPS, ఇతర ఉన్నతాధికారుల నుంచి లేఖ తీసుకోవాల్సి వచ్చేది. పోలీసులు మనం ఇచ్చిన అడ్రస్ కు వచ్చి వెరిఫికేషన్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆ పద్దతికి స్వస్తి చెప్పారు. నిబంధనలను పూర్తిగా తొలగించారు. నేరుగా పాస్ పోర్టు జారీ చేయనున్నారు. ఇకపై తత్కాల్‌ పద్దతి కింద పాస్ పోర్టుకు  దరఖాస్తు చేసుకునేవారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పేపర్ తో పాటు ఆధార్‌కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కు సంబంధించిన 12 పత్రాల్లో ఏవైనా రెండింటిని సమర్పిస్తే సరిపోతుంది. ఆ వెంటనే పాస్ పోర్టు జారీ అవుతుంది. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ చేయనున్నారు.

తత్కాల్‌ మొదటి కేటగిరీ రుసుం రూ. 3,500 చెల్లిస్తే మూడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తారు. ఒకవేళ పైన పేర్కొన్న డాక్యుమెంట్లు జతచేసి సాధారణ ఫీజు రూ. 1,500  చెల్లిస్తే తత్కాల్‌ రెండో కేటగిరీ కింద మూడు నుంచి ఏడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తారు. సెల్ఫ్ డిక్లరేషన్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్.. ఈ మూడు కీలక డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ఇక పాస్‌పోర్టు మూడు రోజుల్లోనే వస్తుంది. తత్కాల్ పాస్ పోర్టు జారీకి సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించిందని తెలిపారు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి. పోలీస్ వెరిఫికేషన్ అనేది ముందు జరిగే ప్రక్రియ ఎంత మాత్రం కాదని.. జారీ తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. సో.. ఎమర్జెన్సీ కింద పాస్ పోర్ట్ కావాలంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. బీ కూల్..

Posted in Uncategorized

Latest Updates