దేశ ప్రయోజనం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి : కేసీఆర్

భువనేశ్వర్ : దేశం అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఆదివారం ఒడిశా వెళ్లిన ఆయన..ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు.

భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఫ్రంట్ గురించి ఇప్పుడే చర్చలు ప్రారంభించామని.. మళ్లీ కలిసి చర్చలు జరుపుతామని చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా చాలామంది నాయకులతో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గుణాత్మక మార్పు అవసరమని.. దానికోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నవీన్ పట్నాయక్ రైతుల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్న కేసీఆర్..  రైతు బంధు లాంటి పథకాన్ని ఒడిశాలో అమలు చేస్తున్నందుకు సంతోషమన్నారు.

నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్తామన్నారు. మేం ఎవరికీ తోక పార్టీలం కాదని.. దేశంకోసం ఏదైనా చేయాలనే అభిప్రాయాన్ని తెలిపిన నవీన్ పట్నాయక్.. సీఎం కేసీఆర్ మంచి ప్రయత్నం చేస్తున్నారని కితాబిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates