ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలు : కేటీఆర్

ktrmdrపాలమూరు జిల్లా పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో శుక్రవారం పర్యటించారు కేటీఆర్. చేనేత కార్మికులను పలుకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. అనంతరం మదనాపురంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్… పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. పాలమూరు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత పాలకులు పాలమూరు గోసను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. పాలమూరును పచ్చగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ జిల్లా పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఎండిపోయిన బీళ్లకు సాగునీరు అందిద్దామని సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. 60 ఏండ్లు అరిగోస పెట్టిన నేతలు.. తెలంగాణలో ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఈ నాలుగేళ్లలో పాలమూరు ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఇక్కడ 4380 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates