ప్రాజెక్టులకు జల కళ : జూరాల, బాబ్లీకి వరద ఉధృతి

juralaతొలకరితోనే తెలంగాణకు శుభవార్త. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు కళకళలాడుతున్నాయి. వీటికితోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ నీటి కళ సంతరించుకుంది. రెండ్రోజులుగా.. 2వేల 965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు ఉంది. మరో నాలుగు, ఐదు రోజులు ఇదే విధంగా ఇన్ ఫ్లో ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. తొలకరి ప్రారంభంలోనే ఈ స్థాయిలో నీళ్లు జూరాలకి వస్తుండటంతో.. కల్వకర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

మరోవైపు బాబ్లీ ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వస్తుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. బాబ్లీ నుంచి 20వేల క్యూసెక్కుల నీళ్లు రాష్ట్రంలోకి వస్తున్నాయి. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates