ప్రాజెక్టులకు భారీగా వరదలు : ఉప్పొంగుతున్న ప్రాణహిత

PRANAHITHAఎగువన  కురుస్తున్న  వానలతో  మంచిర్యాల  జిల్లాలో  ప్రాణహిత,  గోదావరి  నదులు  ఉగ్రరూపం  దాల్చాయి. గోదావరికి  వరద  పోటెత్తడంతో… మేడిగడ్డ  బ్యారేజీ  పనులకు  బ్రేక్ పడింది.  దీంతో  నీళ్లను  మళ్లిస్తున్నారు ఇరిగేషన్  అధికారులు.  అటు   పై నుంచి  వస్తున్న  వరదతో …శ్రీరాంసాగర్ కు  ఇన్ ఫ్లో  పెరుగుతోంది. ప్రాజెక్టుకు  9వేల  క్యూసెక్కుల  వరద  ప్రవాహం కొనసాగుతోంది.

భారీ వర్షాలతో  ప్రాణహిత  ఉప్పొంగుతోంది.  భూపాలపల్లి జిల్లా  అర్జునగుట్ట  దగ్గర  నదీ ఉగ్రరూపం దాల్చింది.  వరదతో చుట్టుపక్కల  పొలాల్లో  నీళ్లు చేరాయి.  ఇక  కొన్ని గ్రామాల  మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రవాహం  అంతకంతకూ  పెరుగుతుండడంతో …భద్రతా  చర్యలు తీసుకుంటున్నారు  అధికారులు.

Posted in Uncategorized

Latest Updates