ప్రాజెక్టు ప్రత్యేకతలు : నాగార్జునసాగర్ నిర్మాణం ఇలా జరిగింది

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ కు పునాదిరాయి పడి నేటికి 63 ఏళ్లు గడిచాయి. ఇవాళ డిసెంబర్-10 ప్రాజెక్టు 64వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సాగర్ పునాదిరాయి పైలాన్ దగ్గర వేడుకలు నిర్వహించారు.

చరిత్ర ఇది..

1954 డిసెంబర్ 17న అప్పటి గవర్నర్ త్రివేది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రకటించారు. 1955 డిసెంబర్ 10 న అనాటి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మణానికి పైలాన్ పిల్లర్ దగ్గర శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే రాతి ఆనకట్టల్లో నాగార్జునసాగర్ మొదటిస్థానంలో నిలిచింది. 1955 నుండి 1967 వరకు 12 సంవత్సరాలు పాటు పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో, లక్షలాది మంది కూలీల మానవశక్తితో దీనిని నిర్మించారు. ప్రతిరోజు 500 మందికిపైగా ఇంజినీర్లు, 500 మంది వర్క్‌చార్ట్ ఉద్యోగులు, 40 వేల మంది కూలీలు పనులు నిర్వహించారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలు
రాతి కట్టడం పొడువు 4758 అడుగులు, 408 అడుగుల ఎత్తుతో, 300 అడుగుల వెడల్పుతో, 79 బ్లాకులుగా ప్రాజెక్టు నిర్మించారు. రెండు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్‌లమధ్య 546 అడుగుల పైన 45, 44 అడుగులతో 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఇంజినీర్ కేఎల్ రావు పర్యవేక్షణలో అమర్చారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకున్నపుడు 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 11,70,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ కృష్ణలోకి స్పీల్‌వే మీదుగా విడుదల చేసేలా రూపొందించారు. ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు.

Posted in Uncategorized

Latest Updates