ప్రాణం తీశారు కదరా : కట్టేసి కొడుతుంటే.. సరదాగా సెల్ఫీలు దిగారు

kerala-man-beat-up

రోడ్డుపై యాక్సిడెంట్ అయ్యింది.. మాములుగా అయితే అయ్యో అంటూ వెళ్లి కాపాడతాం. పోకిరీలు అమ్మాయిల వెంట పడుతుంటే అడ్డుకుంటాం.. ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్లి కాపాడతాం.. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు కాలంతోపాటు మనుషులు కూడా మారిపోయారు. సెల్ఫీలు దిగుతూ పిచ్చిచేష్ఠలు చేస్తున్నారు. సెల్ఫీ పిచ్చిలో ఓ నిండు ప్రాణాలు తీశారు కొందరు యువకులు. కళ్లెదుట ఘోరం జరుగుతుంటే సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తూ దుర్మార్గంగా వ్యవహరించారు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరం సెల్ఫీ పిచ్చికి పరాకాష్టగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే..

కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాలోని అత్తపాడి గ్రామం అడవీ ప్రాంతంలో ఉంది. ఈ అడవిలో మతిస్ధిమితం లేని 27 ఏళ్ల యువకుడు కొన్ని ఏళ్లుగా తిరుగుతూ ఉన్నాడు. ఇటీవల గ్రామంలోని షాపుల్లో తినుబండారాలు మాయం అవుతున్నాయి. ఆహార పదార్థాలను అడవిలో తిరిగే మతిస్థిమితం లేని వ్యక్తే దొంగతనం చేస్తున్నాడని గ్రామస్తులు డిసైడ్ అయిపోయారు. అంతే అందరూ అతన్ని పట్టుకున్నారు. చేతులను తాళ్లతో కట్టేశారు. కొన్ని గంటలపాటు కొడుతూ, తిడుతూ, అతనికి నరకం చూపించారు. పిచ్చోడు.. అందులోనూ చేతులను కట్టేసి ఉంచటంతో.. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఎవరికి వారు కొడుతూ.. సెల్ఫీలు, వీడియోలు తీస్తూ ఉన్నారు. పరిస్థితి చేయిదాటిపోతుంది.. దారుణం జరుగుతుందన్న జ్ణానం ఎవరికీ లేకుండా పోయింది. పక్కనే ఉన్న యువకులు ఈ ఘటనను ఆపాల్సిందిపోయి.. బాధితుడితో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు వచ్చారు. అప్పటికే అతను కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటన కలకలం రేపింది. సెల్ఫీ పిచ్చి యువత ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేంత పిచ్చిలో పడిపోయింది అంటూ పోలీసులే ఆ యువకులను మందలించారు. కనీస ఆలోచన కూడా లేకుండా మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగటం ఏంటీ అంటూ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు..

Posted in Uncategorized

Latest Updates