ప్రాణత్యాగానికి సిద్ధమైన వ్యక్తి సీఎం కేసీఆర్: హరీశ్

harishraoప్రాణం కంటే తెలంగాణ సాధనే ముఖ్యమని ప్రాణత్యాగానికి సిద్ధమైన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. శనివారం(ఫిబ్రవరి-17) మహబూబ్‌నగర్‌ నారాయణపేటలో ఎత్తిపోతల సాగునీటి సాధన సభకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎన్నో సార్లు పదవులకు రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. కొనియాడారు.

అంతకుముందు దామరగిద్దలో రూ. 3 కోట్లతో నిర్మించిన గోదాములను మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి, ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. నీళ్లు ఎక్కడుంటే అక్కడ నాగరికత ఉంటుందన్నారు మంత్రి హరీశ్. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేయడమే కేసీఆర్ లక్ష్యమని… ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఓ ఇంజినీర్‌లాగా ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేశారని తెలిపారు. దేశంలో ఫుల్ కరెంట్ ఉంటే కర్ణాటకలో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 75 వేలు ఇస్తున్నామని.. నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ వస్తే వార్త.. కాని టీఆర్‌ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అని అన్నారు. మహిళలు మంచినీటికి ఇబ్బంది పడవద్దనే మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామన్నారు. పాలమూరు జిల్లాకు నీళ్లు ఇద్దామనుకుంటే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తి కావొద్దన్నదే కాంగ్రెస్ ఎజెండా అన్న మంత్రి హరీశ్.. కొద్ది రోజుల్లో నారాయణపేట నియోజకవర్గంలో కెనాల్ పనులు ప్రారంభిస్తామన్నారు. అంతేకాదు మరికల్‌కు కొత్త మార్కెట్ యార్డు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates