ప్రాణానికి ప్రాణం : వ్యక్తిని చంపిందని 300 మొసళ్లపై దాడి

ప్రతీకారానికి 300 మొసళ్లు బలయ్యాయి. ఓ వ్యక్తిని మొసలి చంపేసిందని గ్రామస్థులు మొత్తం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి మొసలిబారినపడి ఏ వ్యక్తి చనిపోకుడదనుకున్నారు. సమీపంలో ఉన్న ఎన్ క్లోజర్ లోని మొసళ్లను వెతికి చంపారు. కనిపించనదాన్ని వదలకుండా చంపారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్ లో జరిగింది. మొత్తం 300కి పైగా మొసళ్లును చంపినట్లు నిర్ధారించారు. సుగితో అనే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మొసలి ఉన్న ఎన్‌ క్లోజర్‌ లోకి పడిపోగా.. అది అతన్ని చంపేసింది. అదే రోజు అతని అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు.. మొసళ్ల ఎన్‌ క్లోజర్‌ ను ఇళ్ల మధ్య పెట్టడంపై సీరియన్ అయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడానికి ఎన్‌ క్లోజర్ సిబ్బంది అంగీకరించినట్లు చెప్పారు పోలీసులు.

అయినా గ్రామస్థులు మాత్రం వినలేదు. వందల సంఖ్యలో ఉన్న స్థానికులు కత్తులు కటార్లతో మొసళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడున్న మొత్తం 300కి పైగా మొసళ్లను చంపేశారు. అందులో నాలుగు అంగుళాల పొడవున్న చిన్న పిల్లల నుంచి రెండు మీటర్ల పొడవున్న పెద్ద మొసళ్లు ఉన్నాయి. ఈ దాడిని తాము అడ్డుకోలేకపోయామని చెప్పారు పోలీసులు. ఇండోనేషియాలో వివిధ రకాల మొసలి జాతులు ఉన్నాయని.. ఇవి తరచూ మనుషులపై దాడి చేసి చంపుతున్నాయని తెలిపిన పోలీసులు.. ఈ ఏడాది మార్చిలో ఇలాగే ఆరు మీటర్ల పొడవున్న మొసలిని అధికారులే కాల్చి చంపారని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates