ప్రాణాలు దైవాదీనం : బస్సు డ్రైవర్.. పేపర్ చదువుతూ డ్రైవింగ్

driverబస్ డ్రైవర్ కు ఎంతో జాగ్రత్త అవసరం. తన చేతిలోనే బస్సులో జర్నీ చేసే ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయన్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. ట్రైనింగ్ టైంలో కూడా ఎన్నో జాగ్రత్తలు…మెళుకువలు నేర్పుతారు నిపుణులు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధులు నిర్వహించే డ్రైవర్లలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రయాణికులు చనిపోయారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ప్రయాణికుల భద్రత కోసం అధికారులు కటిన చర్యలు చేపడుతున్నా…కొందరు బస్ డ్రైవర్లలో మార్పు మాత్రం రావడం లేదు. సెల్ ఫోన్లలో మాట్లాడుతూ.. పక్కనే కూర్చున్న ప్యాసింజర్ తో ముచ్చటిస్తూ…లిమిట్ కు మించిన  స్పీడ్ తో బస్సులను నడుపుతున్నారు. ఇది కాస్తా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

చెన్నై కార్పొరేషన్‌ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్‌ న్యూస్ పేపర్ చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. శనివారం(జులై-1) ఆవడి నుంచి తిరువాన్‌మ్యూర్‌ వైపుగా కార్పొరేషన్‌ బస్సు(నెంబర్- 47D) వెళుతోంది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్‌ అంబత్తూర్‌ ప్రాంతంలో వస్తుండగా పత్రికను స్టేరింగ్‌పై చదువుతూ బస్సు నడుపుతున్నాడు. ఇది చూసి ఆందోళన చెందిన ప్రయాణికులు అతన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తుంది.

బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. దీనిపై స్పందించిన ఆ రవాణ సంస్థ అధికారి… బస్సు అంబత్తూర్‌ బస్సు డిపోకి చెందిందని… డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates