ప్రాబ్లమ్ తెలిస్తే షాక్ : ఉరితీసిన 136 ఏళ్లకి క్షమాభిక్ష

irl2100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు..  ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయశాస్త్రం సిద్దాంతం. అయితే లండన్‌లో జరిగిన ఓ కేసులో ఆ అవకాశం లేకుండా పోయింది. ఓ వ్యక్తికి శిక్ష విధించిన 136 ఏళ్ల తర్వాత ఆ శిక్ష తప్పని తేలింది. తాను చెప్పిన తీర్పు తప్పు అని తెలుసుకునే సరికే జడ్జి చనిపోయాడు. దీంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించారు.

1882 ఆగస్టులో ఐర్లాండ్‌ లో ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. హంతకుల్లో ఒకరైన జాయిసీ అనే వ్యక్తికి ఈ ఘటనతో తనకెటువంటి సంబంధంలేదని కోర్టులో ఎంతగానో వాదించాడు. విచారణం మొత్తం ఇంగ్లీష్ లోనే జరగటం.. జాయిసీకి ఐరీష్ లో మాట్లాడటం మాత్రమే తెలియడం.. ఇంగ్లీష్ లో మాట్లాడటం అతడికి తెలియకపోవడంతో అతడి వాదనలను ఎవరూ పట్టించుకోలేదు. నేను నిర్దోషినంటూ అతడు అని  ఎంత విన్నవించుకున్నా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. దీంతో 1882 డిసెంబర్ లో అతడిని ఉరితీశారు.

మొదటి నుంచి అతడికి విధించిన శిక్షపై అనుమానం ఉండటంతో ఐరిష్‌ ప్రభుత్వం ఒక కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణలోఅతడికి వేసిన శిక్ష సరైంది కాదని తేలడంతో అసలు విషయం బయటపడింది. దీంతో 136 ఏళ్ల తర్వాత బుధవారం(ఏప్రిల్ 4) ఐర్లాండ్‌ అధ్యక్షుడు మైకెల్ డి హిగ్గిన్స్ జాయిసీకి మరణానంతర క్షమాభిక్ష ప్రసాదించారు. ఐర్లాండ్, బ్రిటన్‌ చరిత్రకు ఇది మచ్చ తెచ్చిన సంఘటన అని అభిప్రాయపడ్డారు. ఈ క్షమాభిక్ష ద్వారా అయినా దాన్ని కొంతమేర సరిదిద్దుకోగలమని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates