ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలకు స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ సమావేశాలకు చైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు. బుధవారం(జూలై-18) నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 24 రోజుల్లో 18 పని దినాలపాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కాకుండా వివిధ అంశాలపై చర్చకు 62 గంటల సమయం కేటాయించారు.

మరోవైపు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ఇప్పటికే విపక్షాలను కోరారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates